కరోనా వ్యాక్సిన్ పరిశోధనలో భారతీయ మహిళ..!

వాస్తవం ప్రతినిధి: ప్రపంచాని గడగడలాడిస్తున్న కొవిడ్-19 వ్యాక్సిన్ పరిశోధనలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటి ముందు వరుసలో ఉన్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్‌ తయారీకి సంబంధించిన ప్రాజెక్ట్‌లో భారత సంతతికి చెందిన చంద్రబాలి దత్త(34) కూడా ఉన్నారు. కలకత్తాకు చెందిన చంద్రబాలి.. యూనివర్శిటీకి చెందిన జెన్నర్ ఇన్‌స్టిట్యూట్‌‌లోని క్లినికల్ బయోమ్యాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇన్‌స్టిట్యూట్ వ్యాక్సిన్‌కు సంబంధించి ఫేస్-2, ఫేస్-3 ట్రయిల్స్‌ను నిర్వహిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో చంద్రబాలి క్వాలిటి అషురెన్స్ మేనేజర్‌గా సేవలందిస్తున్నారు. ఇలాంటి ప్రాజెక్టులో తాను భాగమవడం గౌరవంగా భావిస్తున్నానని చంద్రబాలి తెలిపారు.