జగన్ పై టీడీపీ సీనియర్ నేత షాకింగ్ కామెంట్స్

వాస్తవం ప్రతినిధి: సీఎం జగన్ పై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య షాకింగ్ కామెంట్స్ చేసారు. సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు ఈ నెల నుంచి పేదవారి పింఛన్ రూ.2500 ఇవ్వాల్సి ఉందని.. ఈ విషయంలో మాట తప్పారా? మడప తిప్పారా? అంటూ టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ట్వీట్ చేశారు. “ముఖ్యమంత్రి గారు! మీరు ఇచ్చిన హామీ ప్రకారం, ఈ నెల అంటే జూన్ నుంచి.. పేదవారి పింఛన్ రూ.2500 ఇవ్వాలికదా? ఇవ్వరేంటి? మాట తప్పారా, మడమ తిప్పారా? ప్రజా సంక్షేమాన్ని గాలి కొదలి.. వ్యవస్థల మీద కక్ష కడతారా? ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ.. రాజ్యాంగాన్ని ధిక్కరిస్తారా? ప్రజాపాలన మంటగలుపుతారా?” అని వర్ల రామయ్య ట్వీట్ చేశారు.