కరోనా వైరస్ ఎఫెక్ట్ తో కేంద్రం హెల్ప్ అడుగుతున్న కేజ్రీవాల్..!!

వాస్తవం ప్రతినిధి: కరోనా వైరస్ ఎఫెక్టుతో ఢిల్లీ ప్రభుత్వం చేతులెత్తేసింది. లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర ఆదాయం పడిపోవడంతో సీఎం కేజ్రీవాల్ ఐదువేల కోట్లు వెంటనే విడుదల చేయాలని కేంద్రం హెల్ప్ అడిగారు. ఉద్యోగస్తులకు మూడు వేల కోట్లు మరియు రాష్ట్రంలో ఇతర అవసరాలకు రెండు వేల కోట్లు ఇవ్వాలని ఢిల్లీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఇటువంటి క్లిష్ట సమయంలో ఢిల్లీ ప్రజలను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని ట్విటర్ లో సీఎం పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి మనీశ్‌ సిసోడియా ఈ విషయమై మాట్లాడుతూ.. కరోనా విపత్తు సమయంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తామన్న నిధుల్ని ఇవ్వలేదని పేర్కొన్నారు. ఉద్యోగుల జీతాలకు రూ.3500 కోట్లు, ఇతర అవసరాలకు కలిపి రూ.5 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశామని చెప్పారు. కరోనా పోరులో నిరంతరం శ్రమిస్తున్న ఉద్యోగుల జీతాల చెల్లింపునకు కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్రం ఉందని కేజ్రీవాల్ అన్నారు.