యూఏఈకి ప్ర‌వాసుల త‌ర‌లింపుపై కీల‌క ప్ర‌క‌ట‌న‌ చేసిన భారత్

వాస్తవం ప్రతినిధి: యూఏఈకి ఎన్నారైల త‌ర‌లింపుపై కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. యూఏఈ వీసా క‌లిగిన ఎన్నారైల‌ను అక్క‌డి ప్ర‌భుత్వం ఆంక్ష‌లు తొలిగించిన త‌ర్వాతే త‌ర‌లిస్తామ‌ని పేర్కొంది. కాగా… విదేశీయుల‌ను త‌మ దేశంలోకి అనుమ‌తించే విష‌యంలో యూఏఈలో ఇంకా ఆంక్ష‌లు కొన‌సాగుతున్నాయని తెలిపింది. క‌నుక ఆంక్ష‌లు తొలిగిపోయిన త‌ర్వాత యూఈఏ వీసాదారుల‌ను తిరిగి అక్క‌డికి పంపిస్తామ‌ని పేర్కొంది.ఈ మేర‌కు కేంద్ర పౌర‌విమాన‌యాన శాఖ మంత్రి హ‌ర్దీప్ సింగ్ పూరీ యూఏఈ వీసా హోల్డ‌ర్ల‌ను ఉద్దేశించి ఒక ట్వీట్ చేశారు. కాగా, క‌రోనా లాక్‌డౌన్ వల్ల ప్ర‌యాణాల‌పై ఆంక్ష‌లు విధించ‌డంతో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన యూఏఈ వీసాదారుల‌ను జూన్ 1 నుంచి తిరిగి యూఏఈ వ‌చ్చేందుకు అక్క‌డి స‌ర్కార్‌ అనుమ‌తి ఇచ్చింది.