పంజాబ్‌ లో ఘోరం..హ‌త్య‌కు గురైన ఎన్నారై దంప‌తులు

వాస్తవం ప్రతినిధి: ఎన్నారై దంప‌తులు హ‌త్య‌కు గురైన దారుణ సంఘ‌ట‌న పంజాబ్‌లోని ఫ‌గ్వారాలో చోటు చేసుకుంది. కెనడాలో ఉండే కిర్పాల్ సింగ్ మిన్హాస్ (67), దేవిందర్ కౌర్ (65) దంప‌తులు గ‌తేడాది న‌వంబ‌ర్‌లో స్వ‌స్థ‌ల‌మైన ఫ‌గ్వారాలోని ఓంకర్ నగర్‌కు వ‌చ్చారు. క‌రోనా లాక్‌డౌన్ వ‌ల్ల భార‌త్‌లోనే ఉండిపోవాల్సి వ‌చ్చింది. కొన్ని రోజుల క్రిత‌మే తిరిగి కెన‌డా వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే, శ‌నివారం రాత్రి ఉన్న‌ట్టుండి ఈ దంప‌తులు దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. కొంత మంది దుండ‌గులు వీరి గొంతు కోసి హ‌త‌మార్చిన‌ట్లు పోలీసులు గుర్తించారు.