కరోనా సంక్షోభంలో 50 మంది బ్రాహ్మణులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన టీడీఎఫ్

వాస్తవం ప్రతినిధి: కోవిడ్‍ 19 లాక్‍డౌన్‍ కారణంగా ఇబ్బంది పడుతున్న బ్రాహ్మణులను టీడిఎఫ్‍ అమెరికా ఆధ్వర్యంలో ఇండియాలో ఉన్న టీడిఎఫ్‍ విభాగం వారు ముందుకు వచ్చారు. ఇందులో భాగంగా బాగ్‍ అంబర్‍పేట్‍ డిడి కాలనీలో నిర్వహించిన కార్యక్రమాల్లో దాదాపు 50మంది బ్రాహ్మణులకు నిత్యావసర వస్తువులను అందజేశారు. అమెరికాలో ఉంటున్న కవితా చల్లాతోపాటు వారి స్నేహితులు అందించిన విరాళంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు టీడిఎఫ్‍ ఇండియా టీమ్‍ ప్రెసిడెంట్‍ వట్టె రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శి మట్ట రాజేశ్వర్‍ రెడ్డి తెలిపారు. లాక్‍డౌన్‍ కారణంగా చాలామంది బ్రాహ్మణులు ఉపాధిలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి సమయంలో వారిని ఆదుకునేందుకు టీడిఎఫ్‍ ముందుకు రావడం సంతోషకరమని చెప్పారు.