దేశం కాని దేశంలో.. తెలుగు యువ‌కుడు మృతి

వాస్తవం ప్రతినిధి: ఉన్న‌త చ‌దువులు చ‌దివి మంచి ఉద్యోగం కోసం సౌతాప్రికా వెళ్లిన తెలుగు యువ‌కుడు అనారోగ్యంతో మృతి చెందాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైరారూరల్ మండల పరిధిలోని గరికపాడు గ్రామానికి చెందిన హర్షవర్ధన్‌ రెడ్డి(27) పోస్ట్‌గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసిన గ‌తేడాది ఫిబ్ర‌వ‌రిలో సౌతాఫ్రికా వెళ్లాడు. అక్క‌డ ఓ మంచి ఉద్యోగంలో చేరాడు. అయితే ఉన్నట్లు ఉండి కొన్ని రోజుల క్రితం అత‌ను తీవ్ర అనారోగ్యానికి గుర‌య్యాడు. దీంతో స్నేహితుల స‌హాయంతో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ.. ఈ విష‌యాన్ని ఇక్క‌డున్న‌ త‌ల్లిదండ్రులకు ఫోన్ ద్వారా తెలిపాడు. దాంతో కుమారుడిని స్వ‌దేశానికి ర‌ప్పించేందుకు తెలిసిన వాళ్ల ద్వార ప్రయత్నించారు. కానీ, ఆరోగ్యం మ‌రింత క్షీణించ‌డంతో హర్షవర్ధన్‌రెడ్డి బుధ‌వారం ఉద‌యం చికిత్స పొందుతున్న ఆస్ప‌త్రిలోనే చ‌నిపోయాడు. చేతికి అందివ‌చ్చిన‌ కొడుకు ఇలా అర్ధాంత‌రంగా త‌నువు చాలించ‌డంతో త‌ల్లిదండ్రులు గుండెలవిసెలా రోధిస్తున్నారు.