నిరుపేదలకు ఎన్నారై టీడీపీ చేయుత

వాస్తవం ప్రతినిధి: నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో నిన్న నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలోని చామళ్లమూడి గ్రామంలో కొవిడ్-19 కారణంగా ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు ఎన్నారై టీడీపీ నిత్యావసర వస్తువులను పంపిణీ చేసింది. వట్టిచెరుకూరుకు చెందిన ధరనేష్ యడ్లపల్లి, రామ్ చౌదరి అనే ఎన్నారైలు ఆర్థిక సాయాన్ని పంపగా.. స్థానిక నేతలు నిత్యావాసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు వారు చెప్పారు.