ధోని ని ఆకాశానికెత్తేసిన శ్రీశాంత్

వాస్తవం ప్రతినిధి: హలో యాప్‌తో.. సంభాషణలో శ్రీశాంత్ ధోని ఆకాశానికెత్తేశాడు.. పెద్ద స్టేట్‌మెంట్ ఇచ్చారు, “ధోనికి ఇంకా ఫిట్‌నెస్ ఉందని. గతంలో కంటే మెరుగ్గా కనిపిస్తున్నాడని, ప్రస్తుతం రిషబ్ పంత్, సంజు సామ్సన్ అయితే ధోని తో సమానం అయితే కాదని శ్రీశాంత్ పేర్కొన్నారు. పాకిస్థాన్‌ తో మ్యాచ్ అంటే ధోని ఆస్వాదించేవాడని, సిక్సర్లు కొట్టేవాడు అని శ్రీశాంత్ అన్నారు. శ్రీశాంత్ మాట్లాడుతూ, “పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ కు ముందు ధోని తనను అడిగేవాడని… ఈ రోజు ఏ బౌలర్ సిక్సర్ కొట్టాలో చెప్పమనేవాడని అన్నాడు. మహమ్మద్ ఆసిఫ్ బౌలింగ్ లో బాదాలని తాను చెప్పినట్లు గుర్తచేశాడు. అన్నట్లుగానే ధోని చాలా లాంగ్ సిక్సర్ కొట్టాడు. ధోని మాటిచ్చి సిక్సర్లు కొట్టేవాడని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు.