ఆ అంశంపై ఇతరుల జోక్యం అవసరం లేదు అనుకుంట..!

వాస్తవం ప్రతినిధి: ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్‌ తీసుకున్నాడనే వార్త సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీంతో ప్రతి ఒక్కరు అయోమయానికి గురయ్యారు. ఇక మహీ అభిమానులు అయితే ఏడ్చేసినంత పని చేసారు. అయితే ఈ వార్తలను మహీ సతీమణి సాక్షి సింగ్‌ ధోనీతో పాటు అతడి సన్నిహితులు కొట్టిపారేశారు.

ధోనీ రిటైర్మెంట్ పై మాజీ కోచ్‌ గ్యారీ కిర్‌స్టన్‌ స్పందిస్తూ.. టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ రిటైర్మెంట్‌పై జరుగుతున్న చర్చ అనవసరమైనదని, ఆటకు ఎప్పుడు వీడ్కోలు పలకాలో నిర్ణయం తీసుకోవాల్సింది మహీనే అని, అలాంటి అంశంపై ఇతరుల జోక్యం అవసరం లేదని గ్యారీ పేర్కొన్నాడు. తన నిర్ణయాన్ని ప్రకటించే అర్హత అతడు సంపాదించుకున్నాడని. అతడు అద్భుతమైన ఆటగాడని గ్యారీ చెప్పుకొచ్చాడు.

ధోనీ రిటైర్మెంట్ పై స్పందిస్తూ.. మహీ సతీమణి సాక్షి సింగ్‌ అవి కేవలం రూమర్ మాత్రమే అని ఖండించిన విషయం తెలిసిందే. ఈ లాక్‌డౌన్ ప్రజల్ని పిచ్చొళ్లని చేసిందని ఘాటుగా స్పందించారు. “అవన్నీ పుకార్లు. లాక్‌డౌన్‌ ప్రజలను పిచ్చొళ్లును చేసిందని నేను అర్థం చేసుకున్నాను” అంటూ ట్వీట్‌ చేశారు. దీనిపై పలువురు అభ్యంతరం తెలపడంతో వెంటనే ఆ ట్వీట్‌ను సాక్షి తొలగించారు. అయితే అప్పటికే ఆ ట్వీట్‌ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అయింది. ఇన్ని రోజులు కూల్‌గానే ఉన్న సాక్షి.. ఈసారి మాత్రం ఫైర్ అయ్యారు. తరుచూ ఇలాంటి వార్తలు వస్తుండటంతో సహనం కోల్పోయి కోపంలో సాక్షి అలా ట్వీట్‌ చేశారని కొందరు అంటున్నారు.