ఎన్టీఆర్ నటించిన సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయి అంటున్న బాలయ్య బాబు..!!

వాస్తవం సినిమా : మే 29 వ తారీకు స్వర్గీయ ఎన్టీరామారావు జయంతి సందర్భంగా బాలకృష్ణ మరియు నందమూరి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ గొప్పతనం గురించి రాజకీయ రంగంలో మరియు సినిమా ఇండస్ట్రీలో ఆయన తీసుకువచ్చిన మార్పులు గురించి ఆయనకు ఉన్న క్రేజ్ గురించి బాలయ్య బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగువారి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పింది ఎన్టీఆర్ అని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం గా నిలిచిపోతాయని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. అదేవిధంగా ఎన్టీఆర్ నటించిన సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయి అని వ్యాఖ్యానించారు. అదేవిధంగా సినిమారంగంలో కొద్దిపాటి సినిమా షూటింగ్ బ్యాలెన్స్ ఉన్న సినిమాలకు అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు బాలయ్యబాబు తెలిపారు. జూన్ రెండోవారంలో సినిమా షూటింగులు తిరిగి పున ప్రారంభం అయ్యే అవకాశం ఉంది అని చెప్పుకొచ్చారు.