ఎస్‌ఈసీ విషయంలో హైకోర్టు తీర్పుపై జనసేనాని స్పందన!

వాస్తవం ప్రతినిధి: ఎస్‌ఈసీ విషయంలో నిబంధనలు మారుస్తూ ఏపీ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టేసిన విషయంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని తెలిపిన జనసేనాని.. ‘రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సును రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసింది. అలాగే ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలకి విశ్వాసం ఇనుమడింపజేసింది’ అని పేర్కొన్నారు.