బాలకృష్ణ పై సీరియస్ అయిన నాగబాబు..!!

వాస్తవం ప్రతినిధి: కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ వలన సినిమా షూటింగులు మరియు సినిమా ధియేటర్లు క్లోజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ అదుపులోకి వస్తున్న తరుణంలో కేంద్రం చాలావాటికి ఆంక్షలు ఎత్తివేసి సడలింపులు ఇస్తున్న తరుణంలో మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇండస్ట్రీ పెద్దల తో సమావేశమైన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సమావేశానికి బాలకృష్ణ తప్ప మిగతా వారంతా హాజరయ్యారు. ఈ విషయంపై స్పందించిన బాలయ్య బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో పెద్దలతో ప్రభుత్వం చేస్తున్న చర్చ గురించి తనకు తెలియదని, పేపర్ లో వార్తల ద్వారా మాత్రమే తెలిసిందని బాలయ్య ఆరోపించారు. అంతేకాకుండా భూములు పంచుకోవడం కోసం సమావేశం అయ్యారేమో అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు నాగబాబు. చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, నోటికి ఎంతొస్తే అంత మాట్లాడటం సరికాదని అన్నారు. బాలయ్య బాబు వ్యాఖ్యలు ఇండస్ట్రీనే మాత్రమే కాక తెలంగాణ ప్రభుత్వాన్ని అవమానించేలా ఉన్నాయి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్ ఎవరు చేస్తున్నారు అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ లో కనబడుతోంది అని నాగబాబు ఆరోపించారు.