యగపురుషుడు అన్న నందమూరి తారకరామారావు: బాబూ రాజేంద్రప్రసాద్ గారు

వాస్తవం ప్రతినిధి: స్వర్గీయ అన్న నందమూరి తారకరామారావు గారి 97 వ జయంతిని పురస్మరించుకుని ఉయ్యూరు టౌన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ గారు పాల్గొని ఎన్టీయార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ గారు మాట్లాడుతూ అన్న ఎన్టీయార్ వ్యక్తి కాదు అని ఆయన ఒక శక్తి అని అన్నారు.బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించి వారిని చట్ట సభలకు పంపిన ఘనత అన్న ఎన్టీయార్ కె చెల్లుతున్నది అన్నారు.

పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని రాజేంద్రప్రసాద్ అన్నారు.ఇటీవల మరణించి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మోహియుద్దీన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు

రాజకీయాలలో, సినీ నటుడు గా రెండు రంగాలలో రాణించిన స్ఫూర్తి ప్రదాత నందమూరి తారకరామారావు అని రాజేంద్రప్రసాద్ కొనియాడారు.ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ గారు కేక్ కట్ చేసి నాయకులకు పంచారు.

కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ టౌన్ అధ్యక్షులు జంపాన గురునాదం, మున్సిపల్ మాజీ చైర్మన్ అబ్దుల్ ఖుద్దుస్,20 వార్డుల అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, మరియు రాజేంద్ర యువత నాయకులు పాల్గొన్నారు.