కువైట్ ప్రభుత్వం కీలక నిర్ణయం

వాస్తవం ప్రతినిధి: కరోనా కారణంగా ప్రపంచం మొత్తం స్వీయ నిర్భంధంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు అమలులో ఉండటంతో ఇతర దేశాల పౌరులు కువైట్‌లో చిక్కుకుపోయారు. వీసాల గడువు ముగిసినా అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మార్చిలో అన్ని రకాల వీసాల గడువును మే చివరి వరకు కువైట్ ప్రభుత్వం పొడిగించింది. పొడగించిన గడువు ఈ నెల ముగుస్తుండటం.. అంతర్జాతీయ విమాన సర్వీసులు ఇంకా మొదలు కాకపోవడంతో కువైట్ ప్రభుత్వం అన్ని రకాల వీసాల గడువును ఆగస్టు 31 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది.