సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఆహార పంపిణీ

వాస్తవం ప్రతినిధి: కరోనా విలయతాండవం చేస్తున్న తరుణంలో పేదలు, నిరాశ్రయులకు నాట్స్ విసృత్తంగా సాయం చేస్తోంది. సెయింట్ లూయిస్‌లో నిరాశ్రయులు ఆహారం లేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న నాట్స్.. మానవత్వంతో ముందుకొచ్చి సాయం చేసింది.

సెయింట్ లూయిస్‌లోని డౌన్‌టౌన్‌లో నాట్స్.. 250 మందికి ఆహారాన్ని అందించింది. నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి, నాట్స్ సెయింట్ లూయిస్ ఛాప్టర్ కో ఆర్డినేటర్ నాగ శ్రీనివాస్ శిష్ట్ల, వైఎస్ఆర్‌కే ప్రసాద్, సురేశ్ శ్రీ రామినేని, నరేశ్ చింతనిప్పు, శ్రీని తోటపల్లి, రమేష్ అత్వాల, అమేయ్ పేటే, రఘు పాతూరి తదితర నాట్స్ ప్రతినిధులు ఈ ఆహార పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిగ్నేచర్ ఇండియా రెస్టారెంట్ యాజమాన్యం.. ఈ ఆహారాన్ని తయారుచేసేందుకు తమవంతు సహకారం అందించింది.