కొవిడ్-19: అబుధాబిలో ఎన్నారై మృతి

వాస్తవం ప్రతినిధి: కరోనా మహమ్మారి కారణంగా భారతీయుడు మృతి చెందిన ఘటన యూఏఈలో చోటుచేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకీ కరోనా మరణాల సంఖ్య, మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. యూఏఈలో కూడా కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో అబుధాబిలోని సన్‌రైస్ స్యూల్‌లో హిందీ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్న భారతీయుడు కరోనా బారినపడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ.. అతను ఆదివారం తుదిశ్వాస విడిచారు. అతని మరణ వార్త విని.. సన్‌రైస్ పాఠశాల యాజమాన్యం షాక్‌కు గురైంది. అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించింది.