వెస్టిండీస్‌‌లో తిరిగి ప్రారంభమైన క్రికెట్

వాస్తవం ప్రతినిధి: కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌‌ టోర్నమెంట్లు నిలిచిపోయాయి. ఇప్పుడిప్పుడే ప్లేయర్లు ఔట్‌‌డోర్ ట్రెయినింగ్‌‌ మొదలుపెడుతున్నారు. కానీ వెస్టిండీస్‌‌లో పరిస్థితి మరోలా ఉంది. స్థానిక సెయింట్‌‌ విన్సెంట్‌‌ గ్రెనెడియన్స్‌‌ క్రికెట్‌‌ అసోసియేషన్‌‌ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి ఓ టీ10 లీగ్‌‌ జరుగుతోంది. విన్సీ టీ10 ప్రీమియర్‌‌ లీగ్‌‌ పేరుతో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో మొత్తం ఆరు టీమ్స్‌‌ బరిలో ఉన్నాయి. కరోనా దెబ్బకు క్రికెటింగ్‌‌ యాక్షన్‌‌ నిలిచిపోయిన తర్వాత.. టెస్ట్‌‌ హోదా కలిగిన ఓ దేశంలో జరుగుతున్న తొలి టోర్నీ ఇదే. మే 31 న ముగిసే ఈ టోర్నీ ద్వారా వైరస్‌‌ వ్యాప్తి జరగకుండా నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. వెస్టిండీస్‌‌లో తిరిగి ప్రారంభమైన క్రికెట్

వాస్తవం ప్రతినిధి: కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌‌ టోర్నమెంట్లు నిలిచిపోయాయి. ఇప్పుడిప్పుడే ప్లేయర్లు ఔట్‌‌డోర్ ట్రెయినింగ్‌‌ మొదలుపెడుతున్నారు. కానీ వెస్టిండీస్‌‌లో పరిస్థితి మరోలా ఉంది. స్థానిక సెయింట్‌‌ విన్సెంట్‌‌ గ్రెనెడియన్స్‌‌ క్రికెట్‌‌ అసోసియేషన్‌‌ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి ఓ టీ10 లీగ్‌‌ జరుగుతోంది. విన్సీ టీ10 ప్రీమియర్‌‌ లీగ్‌‌ పేరుతో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో మొత్తం ఆరు టీమ్స్‌‌ బరిలో ఉన్నాయి. కరోనా దెబ్బకు క్రికెటింగ్‌‌ యాక్షన్‌‌ నిలిచిపోయిన తర్వాత.. టెస్ట్‌‌ హోదా కలిగిన ఓ దేశంలో జరుగుతున్న తొలి టోర్నీ ఇదే. మే 31 న ముగిసే ఈ టోర్నీ ద్వారా వైరస్‌‌ వ్యాప్తి జరగకుండా నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.