ఇండియన్ హాకీ లెజెండ్‌ కన్నుమూత

వాస్తవం ప్రతినిధి: భారత హాకీ దిగ్గజం బల్బీర్‌సింగ్‌ (95) కన్నుమూశారు. మెదడు సంబంధిత వ్యాధితో మే 8 నుంచి చికిత్స పొందుతున్న బల్బీర్‌ సింగ్‌ తుదిశ్వాస విడిచారు. బల్బీర్‌ సింగ్‌ ఈ రోజు ఉదయం 6.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. 1948, 1952, 1956 ఒలింపిక్స్‌లో బల్బీర్‌ సింగ్‌ భారత హాకీ టీంకు మూడు స్వర్ణపతకాలు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. అంతేకాకుండా 1975 వరల్డ్‌ కప్‌ విన్నర్‌ భారత హాకీ టీంకు చీఫ్‌ కోచ్‌, మేనేజర్‌ గా వ్యవహరించారు.