బంతిపై ఉమ్మి నిషేధం వల్ల బౌలర్ల నైపుణ్యాలు పెరుగుతాయి: జో రూట్‌

వాస్తవం ప్రతినిధి: కరోనా వైరస్‌ ప్రభావం కారణంగా బంతిపై ఉమ్మి ని రాయకూడదని ఐసీసీ నిర్ణయించిన నేపథ్యంలో బౌలర్ల నైపుణ్యాలు మెరుగుపడే అవకాశాలున్నాయని ఇంగ్లండ్‌ టెస్టు కెప్టెన్‌ జో రూట్‌ అభిప్రాయపడ్డాడు. భారత స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే నాయకత్వంలోని ఐసీసీ క్రికెట్‌ కమిటీ లాలాజలాన్ని నిషేధించాలని ఐసీసీకి సూచించింది. బౌలర్లు నైపుణ్యాలను పెంచుకోవడంపై దృష్టి పెడతారు. ఇది వారి సామర్థ్యాన్ని పెంచుతుంది. ఎలాగో బంతిపై తడి అంటించకూడదని స్పష్టమైన ఆదేశాలు ఉండటంతో వాళ్లు బంతి షైనింగ్‌ కోసం ఇతర మార్గాలను అన్వేషిస్తారు. ఈ క్రమంలో మరింత కష్టపడుతూ తమ స్కిల్స్‌ను అభివృద్ధి పరుచుకుంటారు అని రూట్‌ తెలిపాడు.