ముచ్చటగా మూడోసారి ప్రభాస్ తో..??

వాస్తవం సినిమా: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ అనే రెండు సినిమాలు చేయడం మనకు అందరికీ తెలిసిందే. రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను పెద్దగా అలరించలేదు. ఇటువంటి సమయంలో ప్రభాస్ తో ముచ్చటగా మూడోసారి పూరి జగన్నాథ్ సినిమా చేయటానికి రెడీ అయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి. లాక్ డౌన్ టైం లో సమయం ఎక్కువగా దొరకటంతో పూరి జగన్నాథ్ చాలా వరకు హీరోలను మైండ్ లో పెట్టుకుని స్క్రిప్టు లు రెడీ చేశారట. ఈ సందర్భంగా ప్రభాస్ కోసం స్క్రిప్టు రెడీ చేశారట. దానికి సంబంధించిన స్టోరీలైన్ ఇటీవల ప్రభాస్ కి ఫోన్ లో చెప్పారట. విపరీతంగా నచ్చడంతో స్క్రిప్టు మొత్తం వినటానికి ప్రభాస్ రెడీ అయినట్లు సమాచారం. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఓకే అయితే త్వరలోనే సినిమా వచ్చే చాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పూరి జగన్నాధ్ తో సినిమా అంటే ప్రభాస్ అభిమానులు కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు.