దేశ ప్రజలకు ప్రధాని మోదీ రంజాన్ శుభాకాంక్షలు

వాస్తవం ప్రతినిధి: రంజాన్ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రత్యేక సందర్భం కరుణ, సామరస్యాన్ని మరింత పెంచుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘ఈద్-ఉల్-ఫితర్‌ శుభాకాంక్షలు. ఈ ప్రత్యేక సందర్భం కరుణ, సోదరభావం, సామరస్యాన్ని మరింత పెంచుతుంది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా.. సంపన్నులుగా ఉండాలి”అని మోడీ సోమవారం ట్వీట్ చేశారు.
కేంద్ర హోంమంత్రి అమిత్​షా రంజాన్ పండుగ గ్రీటింగ్స్ చెప్పారు. రంజాన్ పండుగ అందరికీ శాంతి, సంతోషాలను ఇవ్వాలని ఆకాంక్షించారు. ఈ మేరకు సోమవారం ట్వీట్ చేశారు.