గజం భూమి కూడా అమ్మడానికి వీల్లేదు..టిటిడి ఆస్తుల విక్రయం పై ధ్వజమెత్తిన బీజేపీ

వాస్తవం ప్రతినిధి: టిటిడి ఆస్తుల విక్రయంపై భక్తులు కానుకగా ఇచ్చిన భూములను కాపాడటం మీకు చేతకావడంలేదా? అని టీటీడీ అధికారులను ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. భక్తులు ఇచ్చిన ఆస్తులను కాపాడే సామర్ధ్యం లేకనే అమ్మకాలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వైసీపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

ఆలయాల భూములు విక్రయిస్తే ఎంతటి పోరాటానికైనా సిద్ధమని, ఎంతటి వారినైనా క్షమించేది లేదని తేల్చి చెప్పారు.  అవసరమైతే వీధి పోరాటాలు చేస్తామని హెచ్చరిస్తూ ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేపడతామని వెల్లడించారు.
పైగా, తాము చేస్తున్న ఈ దుర్మార్గపు పనులకు నిరర్ధక ఆస్తులనే కొత్త పేరు పెట్టారని ఎద్దేవా చేశారు. నిరర్దక ఆస్తుల పేరుతో భూములు విక్రయించడం దారుణమని అంటూ ఆలయాల భూమి గజం కూడా అమ్మడానికి వీల్లేదని స్పష్టం చేశారు.