బెల్టుతో కొట్టడం ఎలాగో నాకు బాగా తెలుసు : మంత్రి సంచలన వ్యాఖ్యలు

వాస్తవం ప్రతినిధి: కేంద్ర గిరిజన వ్యవహారాల సహాయక మంత్రి రేణుకా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చత్తీస్ గఢ్ లోని బలరాంపూర్ జిల్లా లో దిలీప్ గుప్తా అనే వ్యక్తి క్వారంటైన్ కేంద్రంలో సదుపాయాలు బాగా లేవని ఫిర్యాదు చేయడంతో.. అతనిపై క్వారంటైన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, తహసీల్దార్ తనపై దాడి చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే కేంద్ర గిరిజన వ్యవహారాల సహాయ మంత్రి రేణుకా సింగ్ అక్కడికి చేరుకున్నారు. అధికారులు తీరుపై మండి పడ్డారు. సదుపాయాలు బాగా లేవని ఫిర్యాదు చేస్తే మీకు ఇష్టం వచ్చినట్టుగా కొడతారా అంటూ ప్రశ్నించారు. అంతేకాదు.. గదిలో పడేసి బెల్టుతో కొట్టడం ఎలాగో నాకు బాగా తెలుసని హెచ్చరించారు. కరోనా విషయంలో అందరూ సరిగా పనిచేయాలని సూచించారు. చత్తీస్ గఢ్ లోని బలరాంపూర్ జిల్లా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.