ప్రజలంతా అలర్ట్ గా ఉండాలి.. వాతావరణ శాఖ హెచ్చరిక

వాస్తవం ప్రతినిధి: గత వారం రోజుల నుంచి ఎండలు మండుతున్నాయి. ఉదయం 7.30, 8 గంటల సమయం అయిందంటే చాలు భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. దీనికి తోడు వడగాల్పుల తీవ్రత కూడా ఎక్కువై పోయింది. దీంతో రాష్ట్ర ప్రజలు ఇండ్ల నుంచి బయటికి రాండానికి భయపడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు ఎండతీవ్రతను తట్టుకోలేక ఎండదెబ్బకు గురవుతున్నారు. దీంతో వాతావరణ శాఖ అధికారులు, వైద్యులు ప్రజలను బయటికి రావొద్దని హెచ్చరిస్తున్నారు.

తెలంగాణలో రానున్న మూడు రోజులు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం ఆదిలాబాద్, కొమురం భీంఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్నసిరిసిల్ల , పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్ నగర్ జిల్లాలలో అత్యధిక వడగాల్పులు వీచే అవకాశం ఉంది. మే 26న రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, కొమురం భీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాలలో అత్యధిక వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కావున ప్రజలంతా అలర్ట్ గా ఉండాలని హెచ్చరించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని వారు సూచించారు.