మాజీ ముఖ్యమంత్రి కి కరోనా పాజిటివ్

వాస్తవం ప్రతినిధి: మాజీ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర కేబినెట్ మినిస్టర్ అశోక్ చవాన్ కరోనా మహమ్మారి బారినపడ్డారు. కాంగ్రెస్ నేత అయిన చవాన్ ప్రస్తుతం ఉద్ధవ్ కేబినెట్‌లో పీడ్ల్యూడీ మంత్రిగా ఉన్నారు. కరోనా లక్షణాలు సోకాయన్న అనుమానంతో పరీక్షలు నిర్వహించగా… ఆ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ అని తేలిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు స్వగ్రామంలోనే వైద్యం అందిస్తున్నారని అధికారులు తెలిపారు. మంత్రి తరచూ ముంబై నుంచి తన స్వగ్రామమైన మరఠ్వాడాకు వెళ్లి వస్తుంటారని.. ఈ క్రమంలోనే ఆయనకు వైరస్ సంక్రమించి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇక ఉద్ధవ్ కేబినెట్‌లోనే మరో మంత్రి, ఎన్సీపీ నేత జితేంద్ర అహ్వాద్‌కు కూడా పాజిటివ్ అని తేలింది. కొన్ని రోజులు వైద్యం అందించిన తర్వాత ఆయన కరోనా నుంచి కోలుకున్నారు.