త్వరలోనే ఆక్స్‌‌ఫర్డ్‌‌ రెండో దశ వ్యాక్సిన్‌‌ ట్రయల్స్‌‌

వాస్తవం ప్రతినిధి: ఆక్స్‌‌ఫర్డ్‌‌ యూనివర్సిటీ వ్యాక్సిన్‌‌ ట్రయల్స్‌‌ స్పీడు పెరుగుతోంది. ఇప్పటికే తొలిదశలో 1,000 మందిపై ప్రయోగం చేసిన వర్సిటీ ఇప్పుడు రెండో దశలో 10,260 మందిపై టెస్టు చేయబోతోంది. త్వరలోనే ప్రయోగం స్టార్టవుతుందని వర్సిటీ వెల్లడించింది. తొలి దశలో కొంత రేంజ్‌‌ వరకు ట్రయల్స్‌‌ జరిగాయని, పూర్తిగా సక్సెస్‌‌ అయ్యామని పేర్కొంది. ఈ దశలో చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు అన్ని వయసుల వాళ్లపై ప్రయోగం చేస్తామని తెలిపింది. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు చైనా, అమెరికా, యూరప్‌లలో 12 వరకూ టీకాలు వేర్వేరు అభివృద్ధి దశల్లో ఉన్నాయి. అయితే ఇంత వేగంగా ఓ వ్యాక్సీన్‌ను తయారు చేయడం ఇదే మొదటిసారి. అయినప్పటికీ ఈ టీకాలు అన్ని ప్రయోగ దశలు దాటుకుని సురక్షితంగా, సమర్థంగా వైరస్‌ను అడ్డుకుంటాయా అన్నది ఇప్పటికీ అస్పష్టమే.