బావ-బావమరిది పెళ్లి ముచ్చట్లు.. నెట్టింట వైరల్..!

వాస్తవం ప్రతినిధి: సెలబ్రిటీల పైన యూట్యూబ్ లో సోషల్ మీడియా మాధ్యమాల్లో నిత్యం ఏదో ఒక విషయమై ప్రచారం జరుగుతూనే ఉంటుంది. అటువంటి ప్రచారాలను కొంత మంది సెలబ్రిటీ లు లైట్ తీసుకుంటారు. మరికొంత మంది ఫైర్ అవుతుంటారు.

అయితే, కొణిదెల వారసుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి ప్రయత్నాలు మొదలెడతామని స్వయంగా అతని తండ్రి నాగబాబు ప్రకటించడంతో ఈ ఇష్యూ నెట్టింట హాట్ టాపిక్ అయింది. ఓ యూట్యూబ్ ఛానెల్‌లో తన పిల్లల వివాహాల గురించి మాట్లాడిన నాగబాబు.. ముందుగా నిహారిక పెళ్లి చేసి, ఆ వెంటనే వరుణ్ తేజ్ మ్యారేజ్ కూడా చేసేస్తామని ప్రకటించారు. దీంతో టాలీవుడ్ సర్కిల్స్‌లో మెగా ఇంట పెళ్లిబాజాల వార్త తెగ వైరల్ అయింది.

“నిహారికకు పెళ్లి.. వరుణ్ తేజ్‌కు కూడా.. అని వచ్చిన ఓ వార్త క్లిప్పింగ్‌ను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసిన సాయితేజ్.. “ఏంటి బావా.. నీకు పెళ్లంట”` అని కామెంట్ చేశాడు. దీనిని రీ-ట్వీట్ చేసిన తమన్.. ‘నిజమా?’ అని ప్రశ్నించాడు. దీంతో వెంటనే ఈ ఇద్దరి ట్వీట్స్‌పై వరుణ్ రియాక్ట్ అవుతూ… దానికి చాలా టైమ్ ఉందిలే గానీ.. మన రానా దగ్గుబాటి, నితిన్ మాత్రం మీతోనే ఉంటాం అంటూనే సింపుల్‌గా సింగిల్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయ్యారు” అంటూ వరుణ్ తేజ్ ట్వీట్ చేసారు.