ప్రముఖ మిమిక్రీ కళాకారుడు హరికిషన్‌ కన్నుమూత

వాస్తవం ప్రతినిధి: ప్రముఖ మిమిక్రీ కళాకారుడు హరికిషన్ కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయన.. కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో హరికిషన్‌ బాధపడుతున్నారు.  హీరోలు ఎన్టీఆర్, కృష్ణ‌, శోభన్ బాబు, చిరు, నాగార్జున, బాల‌య్య‌ల‌తో పాటు ఈ త‌రం హీరోలు ప‌వ‌న్ , మ‌హేష్ ఇలా ప‌లువురు హీరోల గొంతుల‌ని ఎంతో అద్భుతంగా అనుక‌రిస్తూ వ‌చ్చారు. కాగా, సెల‌బ్రిటీలు కూడా త‌న టాలెంట్‌కి ఫిదా అయ్యారు. రాజ‌కీయ నాయ‌కుల గొంతుల‌ని కూడా అనుక‌రించ‌డంలో ఆయ‌న దిట్ట అని చెప్ప‌వ‌చ్చు.

దేశ విదేశాల‌లో ఎన్నో ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చిన హ‌రికిష‌న్ ప్రముఖ నటుడు శివారెడ్డికి గురువు కూడా. మిమిక్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానం లిఖించుకున్న హ‌రికిష‌న్ మృతి తెలుగు వారికి తీర‌ని విషాదాన్ని మిగిల్చింది. రాజ‌కీయ నాయ‌కులు, సినీ ప్ర‌ముఖులు ఆయ‌న మృతికి సంతాపం తెలియ‌జేస్తున్నారు.