దేశరాజధానిలో భానుడి భగభగలు!

వాస్తవం ప్రతినిధి: దేశ రాజధాని ఢిల్లీ ఒకవైపు కరోనా వైరస్‌తో, మరోవైపు అత్యధిక ఎండవేడిమితో పోరాడుతోంది. జనం అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా అవస్థలు పడుతున్నారు. రాజధానిలో ప్రస్తుతం 45 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు దాటాయి. అదే విధంగా రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ ఢిల్లీలలో వేడి గాలులు వీస్తున్నాయి. వాతావరణశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం వచ్చేవారంలో కూడా ఇదే స్థాయి ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశాలున్నాయి.