లక్షణాలు లేకపోయినా.హైడ్రాక్సీ క్లోరోక్వీన్ …ఐసీఎంఆర్ ఆమోదం!

వాస్తవం ప్రతినిధి: హైడ్రాక్సీ క్వోరోక్విన్ మాత్రలు తీసుకుంటే కొవిడ్-19 వైరస్ బారిన పడే అవకాశాలను తగ్గిస్తుందని కనుగొన్న ఐసీఎంఆర్… తాజా ఆదేశాల్లో ఛోవీడ్-19 హాస్పిటల్స్ లో పనిచేసే ఆరోగ్య సంరక్షణ కార్మికులు, కంటైనేషన్ జోన్లలో నిఘా విధిపై పనిచేసే ఫ్రంట్‌లైన్ సిబ్బంది, కరోనావైరస్ సంక్రమణ సంబంధిత కార్యకలాపాలలో పాల్గొనే పారామిలిటరీ లేదా పోలీసు సిబ్బందికి నివారణ మందుగా హైడ్రాక్సీక్లోరోక్విన్‌(హ్ఛ్Q)ను ఉపయోగించాలని  ఐసీఎంఆర్ సిఫార్సు చేసింది.

మరోవైపు కేంద్రం మలేరియా నివారణకు ఇచ్చే హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందును పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి… 60కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తోంది. మన దేశంలో కరోనా వైరస్ సోకిన పేషెంంట్లకు వారికి ట్రీట్మెంట్ చేస్తూ వైరస్ తో పోరాడుతున్న డాక్టర్లు ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్లు వైద్య సిబ్బందికి హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందును ఇస్తున్నారు.

అయితే ఇప్పటివరకూ వైరస్ లేని ప్రాంతాల్లో హెల్త్ కేర్ వర్కర్లకు వైరస్ లక్షణాలు లేకపోతే ఈ మందు ఇవ్వట్లేదు. ఇప్పుడు కేంద్రం దేశంలో కేసులు పెరుగుతుండటంతో లక్షణాలు లేకపోయినా హెల్త్ కేర్ వర్కర్లు అందరికీ అన్ని ప్రాంతాల్లో వారికీ ఈ మందును ఇవ్వాలని ప్రతిపాదించింది.