శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదం ఇకపై..టీటీడీ సంచలన నిర్ణయం !

వాస్తవం ప్రతినిధి: లాక్డౌన్ కారణంగా భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపి వేసి సుమారు రెండు నెలలైందని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్ష్యులు వైవి సుబ్బారెడ్డి చెప్పారు. భక్తులకు స్వామి వారి దర్శనాలు ఎప్పటి నుంచి ప్రారంభిస్తామో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. ఈ నేపథ్యంలో తమకు స్వామివారి లడ్డూ ప్రసాదం అయినా అందించాలని తనకు అనేక విజ్ఞప్తులు వచ్చినట్లు ఆయన చెప్పారు. భక్తుల విజ్ఞప్తి మేరకు అధికారులతో చర్చించి లాక్డౌన్ ముగిసే వరకు రూ.25 కే లడ్డూ ప్రసాదం అందించాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. ఈ పంపిణీ ఎప్పటి నుంచి ప్రారంభం అయ్యేది, రెండు మూడు రోజుల్లో చెబుతామన్నారు.