తెలంగాణలో ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌కు తేదీలు ఖారా‌రు!

వాస్తవం ప్రతినిధి: తెలంగాణలో వాయిదా ప‌డిన ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌కు తేదీలు ఖార‌రు చేసింది ఎస్.ఎస్.సి బోర్డు. జూన్ 8 నుండి జులై 5వ‌ర‌కు ప‌రీక్ష‌లు జ‌ర‌గనున్నాయి. తెలంగాణ హైకోర్టు సూచ‌న మేర‌కు ప్ర‌తి ప‌రీక్ష‌కు రెండు రోజులు గ్యాప్ ఉండేలా అధికారులు ప‌రీక్ష‌ల తేదీల‌ను ఖ‌రారు చేశారు. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో భౌతిక దూరం పాటించేందుకు అద‌నంగా 2500 ప‌రీక్ష కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు.

ప‌రీక్ష‌ల తేదీలు- స‌బ్జెక్ట్స్ ఇవే

జూన్ 8- ఇంగ్లీష్ 1
జూన్ 11- ఇంగ్లీష్ 2

జూన్ 14- మ్యాథ్స్ 1
జూన్ 17- మ్యాథ్స్ 2
జూన్ 20- సైన్స్1
జూన్ 23- సైన్స్ 2
జూన్ 26- సోష‌ల్ 1
జూన్ 29- సోష‌ల్ 2

ఇక విద్యార్థులు ఎవ‌రికైనా జ‌లుబు, ద‌గ్గు వంటి ల‌క్ష‌ణాలుంటే ప్ర‌త్యేక గ‌దుల్లో ప‌రీక్ష‌లు రాయించాల‌ని నిర్ణ‌యించారు. ఉద‌యం 9.30గంట‌ల నుండి 12.00గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష ఉండ‌నుంది. ఇక ప‌రీక్ష కేంద్రం బ‌య‌ట విద్యార్థులు, జ‌నం గుమిగూడ‌కుండా ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకోనుంది రాష్ట్ర విద్యాశాఖ‌.