చరిత్రను తిరగరాసిన జననేత జగన్..!

వాస్తవం ప్రతినిధి: వైసిపికి ప్రజలు అఖండమైన విజయాన్ని అందించి నేటితో ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సంబరాలు నిర్వహించుకుంటున్నారు వైసీపీ శ్రేణులు. అయితే ఈ నేపధ్యంలో వైసీపీ నేత, ఎంపీ విజయ సాయి రెడ్డి ప్రతి పక్ష నేత చంద్రబాబు నాయుడు పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్టర్ ఖాతలో.. “ఏడాది క్రితం ఇదే రోజు, ‘ఫ్యాన్’ ప్రభంజనాన్ని దేశమంతా కళ్లార్పకుండా చూసింది. ఏకపక్ష విజయంతో చరిత్రను తిరగరాశారు జననేత జగన్ గారు. తన వెంట నడిచిన ప్రజల కోసం ‘పది తలల విషనాగు’తో పోరాడారాయన. వ్యవస్థల్ని భ్రష్టుపట్టించి, వేల కోట్లు వెదజల్లిన పచ్చ పార్టీని పాతాళానికి తొక్కారు”… అంటూ ట్వీట్ చేసారు.