టీటీడీ నిర్ణయంపై జనసేన ఆగ్రహం!

వాస్తవం ప్రతినిధి: టీటీడీ ఆస్తుల విక్రయం నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆస్తులను అమ్ముకోవాల్సిన అగత్యం ఏంటని, వైకాపా నేతల కోసం పందేరం వేస్తున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. భక్తులు టీటీడీకి నమ్మకంగా ఇచ్చిన స్థలాలను ప్రజోపయోగ పనులకోసం వాడుకోవాలని, ఖాళీగా ఉన్నాయన్న సాకుతో అయిన వారికి కట్టబెట్టడం సరికాదని అంటున్నారు.

ఈ నేపధ్యంలోనే టీటీడీ నిర్ణయంపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ నిర్ణయంపై న్యాయపోరాటం చేస్తామని జనసేన నేతలు హెచ్చరించారు. వైసీపీ పాలనలో దేవుడికి, దేవుడి ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. టీటీడీ ఆస్తుల పరిరక్షణకు పోరాటం చేస్తామని జనసేన నేతలు ప్రకటించారు.