ప్రభాస్ – నాగ్ అశ్విన్ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ ముద్దుగుమ్మ..??

వాస్తవం సినిమా: ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్… రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ పక్కన హీరోయిన్ అవకాశాన్ని పూజా హెగ్డే దక్కించుకున్న విషయం అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ సంస్థ వారు నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా రన్నింగ్ లో ఉండగానే ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో ప్రభాస్ సినిమా ఓకే చేయటం మనకందరికీ తెలుసు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ పక్కన బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియాభట్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే స్టోరీ అలియా కు నాగ్ అశ్విన్ వినిపించాడట, అంతా ఓకే అయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.