దేశీయ ఎయిర్‌లైన్స్‌ సంస్థలకు కేంద్రం కీలక ఆదేశాలు !

వాస్తవం ప్రతినిధి: దేశీయ ఎయిర్‌లైన్స్‌ సంస్థలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాబోయే మూడు నెలల వరకు పౌర విమానయాన శాఖ నిర్దేశించిన టికెట్‌ ధరలనే అనుసరించాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ స్పష్టం చేశారు. ఆగస్టు 24 వరకు ఈ ధరలే అందుబాటులో ఉంటాయని వివరించారు.

ఈ నెల 25 నుంచి దేశీయ పౌర విమాన సర్వీసులు ప్రారంభం కానున్న నేపథ్యంలో విమాన టికెట్ ధరలను కేంద్రం సవరించింది. దేశీయ విమానాల్లో టికెట్ ధరలు కనిష్టంగా 3000 రూపాయలు గరిష్టంగా 10వేలు ఉంటుందని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూర్తి తెలిపారు. మెట్రో నగరాల్లో మూడో వంతు సర్వీసులు మాత్రమే నడుస్తాయని చెప్పారు. నాన్ మెట్రో నగరాల్లో పూర్తి స్థాయిలో సర్వీసులు నడుస్తాయని వెల్లడించారు. ఢిల్లీ-ముంబై రూట్లో టికెట్ గరిష్ట ధర 10వేలుగా ఉంటుందని తెలిపారు హర్దీప్ సింగ్ పూరి.