మందుబాబులకు జాక్ పాట్ లాంటి వార్త!

వాస్తవం ప్రతినిధి: మందుబాబు లకు చుక్క మందు దొరక్క బక్కచిక్కిపోతున్న సమయంలో దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో మద్యం షాపులు తెరిచారు. లాక్ డౌన్ కారణంగా 40 రోజులుగా మద్యం దొరక్క మందు బాబులు ఎంత ఆగమయ్యారో చూశాం.అయితే భౌతికదూరం మధ్య మందుకొనుగోళ్ళు జరుగుతున్నా.. మరికొన్ని రాష్ట్రాల్లో మాత్రం మందు కోసం వారంతా వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు.

తాజాగా మందుబాబులకు జార్ఖండ్ ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. ఇక మీదట ఆన్‌లైన్‌ ద్వారా ఇంటికే మద్యం హోం డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు స్విగ్గీ జొమాటోలు జార్ఖండ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి.

రాష్ట్రంలోని రాంచీ, జంషెడ్‌పూర్‌, బొకారో లాంటి 9 పట్టణాల్లో లిక్కర్‌ను ఇంటికే డెలివరీ చేసేందుకు స్విగ్గీ, జోమాటోలతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపింది. 15 జిల్లా కేంద్రాల్లో ఆన్లైన్ టోకెన్ విధానం ద్వారా షాపుల్లోనూ లిక్కర్‌ను కొనుగోలు చేసే అవకాశం కల్పించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మద్యం దుకాణాల వద్ద క్యూలైన్లను తగ్గించేందుకు ఆన్‌లైన్‌ డెలివరీకి అనుమతి ఇచ్చామని ప్రభుత్వం తెలిపింది.