లాక్ డౌన్ టైం లో ప్రజలు ఫోన్ లో ఎక్కువగా డౌన్ లోడ్ చేసినవి ఇవే..!!

వాస్తవం ప్రతినిధి: మహమ్మారి కరోనా వైరస్ దెబ్బకి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో 50 రోజులకు పైగా ప్రజలు అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే ఇటీవల కొన్ని ఆంక్షలు ఎత్తివేసి సడలింపులు ఇవ్వటంతో కొంతమందికి ఊరట కలిగింది. ఇదిలా ఉండగా ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ ని ఎదుర్కోవడానికి చాలా దేశాలు లాక్ డౌన్ ని అమలులోకి తీసుకురావడంతో ఉద్యోగాలు మరియు కాలేజీలు, పాఠశాలలు మూతపడటంతో ఇళ్లలో ఉన్న ప్రజలు ఎక్కువగా స్మార్ట్ ఫోన్ మీద పడ్డారు. అయితే ఈ సమయంలో ప్రజలు ఫోన్ లో ఎక్కువగా డౌన్ లోడ్ చేసిన యాప్‌లు ఆరోగ్య సేతు, లుడో కింగ్, జూమ్ యాప్, టిక్‌టాక్, క్యారమ్ పూల్, యూ వీడియో, గూగుల్ పే, వాట్సాఫ్, ఇన్‌స్టాగ్రామ్ లు అంట. ఈ యాప్స్ డౌన్ లోడ్ చేసుకుని చాలావరకు ప్రజలు సమయాన్ని గడిపినట్లు ఇటీవల ఒక అంతర్జాతీయ సంస్థ తెలిపింది.