పై ఆఫీసర్ ని వెంటబడి మరీ రోడ్డుమీద కొడుతూ పరిగెత్తించిన పోలీసులు..!!

వాస్తవం ప్రతినిధి: కరోనా వైరస్ పోరాటంలో పోలీసులు తీవ్రస్థాయిలో కృషి చేస్తూ ఫ్రంట్ లైన్ లో ఉండి ప్రజల కోసం గత కొన్ని రోజులు నుండి పోరాడుతున్నారు. ప్రజల ప్రాణాలకి ముప్పు రాకుండా తమ ప్రాణాలను త్యాగం చేస్తూ రోడ్డుపైనే ఉంటూ ఎక్కడికక్కడ పరిస్థితిని అదుపులో ఉంచుతున్నారు. ఈ విధంగా కష్టపడుతున్న పోలీసుల త్యాగాలను కొన్ని ప్రభుత్వాలు గుర్తించకుండా వారికి కనీసం కేటాయించాల్సిన మాస్క్ లు శానిటైజ్ ర్ లు కూడా ఇవ్వటం లేదు. దీంతో అక్కడక్కడా వివాదాలు కూడా చోటుచేసుకున్నాయి. ఈ విధంగానే ఇటీవల పై ఆఫీసర్ ని పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో దాదాపు 500 మంది కానిస్టేబుల్స్ రోడ్డుమీద వెంటపడి మరీ పరిగెత్తించి దాడి చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో డిసిపి స్థాయి అదికారి ఎన్.ఎస్.పాల్ తమ పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్నారని కానిస్టేబుళ్లు ఆరోపించారు. ఒక కానిస్టేబుల్ కు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయిన తర్వాత కూడా తాము ఉంటున్న బారక్ ను డిసిపి శానిటైజ్ చేయించడం, ఇతర జాగ్రత్తలు తీసుకోవంటివి చేయలేదని వారు ఆరోపించారు. ఆ డిసిపి ఉంటున్న క్వార్టర్స్ ఎదుట ధర్నా దిగి వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ క్రమంలో కొందరు ఆయనపై దాడి చేశారు. దాంతో ఆయన పరుగులు పెట్టగా, కానిస్టేబుళ్లు ఆయనను వెంటాడి కొట్టారు. దీంతో ఈ వార్త పశ్చిమ బెంగాల్ మీడియాలో వైరల్ న్యూస్ గా మారింది.