అత్యంత ప్రమాదకర జోన్ లోకి వెళ్లి పోయిన భారత్..!!

వాస్తవం ప్రతినిధి: ఇండియాలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. లాక్ డౌన్ చాలా పటిష్టంగా అమలు చేసినా గాని వైరస్ ఏ మాత్రం కంట్రోల్ లోకి రావటం లేదు. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి.

యూరోప్ కంట్రీ లో వైరస్ ఎంటర్ అయ్యి ఒక్కసారిగా విధ్వంసం సృష్టించగా, ఇండియాలో మాత్రం భిన్నంగా చాపకింద నీరులా విస్తరిస్తూ ప్రభుత్వాలకు మరియు వైద్యులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

ఇదిలా ఉండగా గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో దేశంలో ఐదువేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ విడుదల చేసిన కోరాని హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది..

దీంతో.. దేశవ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,12,359కు చేరింది.. ఇందులో ప్రస్తుతం 63,624కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.. 48,735 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రిల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.

మరోవైపు గత 24 గంటల్లో భారత్‌లో 132 మంది కరోనా బారినపడి మృతి చెందారు.. దీంతో.. మృతుల సంఖ్య 3,435కు చేరింది. వైరస్ ఈ విధంగానే కొనసాగుతూ వెళ్తే రాబోయే వర్షాకాలం మరియు శీతాకాలంలో ఇండియాలో భయంకరంగా మరణాలు సంభవించే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.