అనుమానాస్పద స్థితిలో యువతి ఆత్మహత్య

వాస్తవం ప్రతినిధి: అనుమానాస్పద స్థితిలో ఓ యువతి అపార్ట్మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పూజ అంబికా (21) తండ్రి ఏడుకొండలు, తల్లి శమంతకమణి దంపతులకు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. స్థానికంగా వీరు చందానగర్ రాజీవ్ స్వగృహ లో నివాసం ఉంటున్నారు. స్థానికంగా దంపతులిద్దరూ టైలరింగ్ చేస్తూ జీవనం గడిపేవారు. కాగా ఈమె బి.టెక్ కంప్యూటర్స్ చేస్తుంది. చదువుకుంటూనే మోతీలాల్ ఓస్వాల్ అనే ఆన్లైన్ ట్రేడింగ్ కంపెనీ లో ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తూ ఉంది. కాగా గురువారం నాడు ఉదయం అయిదున్నర గంటల ప్రాంతంలో అందరూ వాకింగ్ కి వెళ్లే సమయంలో రాజీవ్ స్వగృహ లోని తన అపార్ట్ మెంట్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.