దిక్కుతోచని స్ధితిలో సాయం కోసం భారతీయుల ఎదురుచూపులు..!!

వాస్తవం ప్రతినిధి: ఉపాధి కోసం షార్జా వెళ్లిన 22 మంది భార‌తీయ కార్మికుభార‌తీయ కార్మికులు షార్జాలో రోడ్డున ప‌డ్డారు. మార్చి నెల మొద‌టి వారంలో ఉపాధి కోసం షార్జా వెళ్లిన వీరికి ఇప్ప‌డు పూట గ‌డ‌వ‌డం కూడా గ‌గ‌నంగా మారింది. స‌రియైన ప‌ని దొర‌క‌కపోవ‌డంతో తిరిగి స్వ‌దేశానికి వచ్చేదాం అనుకున్ని విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు. కానీ, మార్చి 22న ఇండియాలో జ‌న‌తా క‌ర్ఫ్యూ, ఆ త‌రువాతి రోజు నుంచి లాక్‌డౌన్ అమ‌లు చేయ‌డంతో విమాన స‌ర్వీసులు ర‌ద్దు అయ్యాయి. ఏజెంట్లు చేసిన మోసంతో ప‌ని దొర‌క‌క క‌ష్ట‌ప‌డుతున్న వారికి విమాన స‌ర్వీసులు నిలిచిపోవ‌డంతో షార్జాలో చిక్కుకుపోయారు. ట్విట్ట‌ర్ ద్వారా వీరి దీన ప‌రిస్థితిని తెలుసుకున్న షార్జాలోని భార‌త కాన్సులేట్ అధికారులు ఆహార సామాగ్రి, నిత్యావ‌స‌ర స‌ర‌కుల‌ను అందించ‌డంతో పాటు వ‌స‌తి సౌక‌ర్యం క‌ల్పించారు. ప్ర‌స్తుతం షార్జాలోని రోల్లా ప్రాంతంలో ఈ కార్మికుల‌ను ఉంచారు. ఈ 22 మంది కార్మికుల‌ను ఏజెంట్లు మోస‌పూరితంగా టూరిస్ట్‌ వీసాల‌పై షార్జాకు తీసుకొచ్చార‌ని కాన్సులేట్ అధికారి జితేంద‌ర్ సింగ్ నేగి తెలిపారు.