ఒక్క‌రోజే అమెరికాలో న‌లుగురు ఎన్నారైలు మృతి..!!

వాస్తవం ప్రతినిధి: అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్ మహమ్మారికి హాట్ స్పాట్ గా మారింది. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. అమెరికాలో 4 లక్షల మందికిపైగా కరోనా బారిన పడ్డారు. 14వేల మంది మరణించారు. రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్యా గణనీయంగా పెరుగుతోంది. దీంతో అమెరికా అల్లకల్లోలంగా మారింది. అమెరికన్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకున్నారు. ఇక అమెరికాలో ఉంటున్న భారతీయులు సైతం కరోనా కాటుకు బలైపోతున్నారు. ఇక మంగ‌ళ‌వారం ఒక్క‌రోజే అమెరికాలోని వివిధ న‌గ‌రాల‌లో న‌లుగురు ఎన్నారైలు మృత్యువాత ప‌డ్డారు. ఈ న‌లుగురిలో ఇద్ద‌రు న్యూయార్క్‌, ఒక‌రు టెక్సాస్‌, మ‌రోక‌రు ఫిలాడెల్ఫియాలో చ‌నిపోయారు. కాగా, మృతి చెందిన న‌లుగురు కూడా కేర‌ళ వాసులేకావడం గమనార్హం.