భారత్‌-పాకిస్థాన్‌ మధ్య వన్డే సిరీస్‌లు నిర్వహించాలి: షోయబ్‌ అక్తర్‌

వాస్తవం ప్రతినిధి: కరోనా వైరస్‌ పై యుద్ధం కోసం నిధులను సేకరించేందుకు పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ కొత్త ప్రదిపాదన తీసుకొచ్చాడు. నిధులను సమీకరించేందుకు చిరకాల ప్రత్యర్థులు భారత్‌ – పాకిస్థాన్‌ మధ్య మూడు వన్డేల సిరీస్‌ నిర్వహించాలని బుధవారం ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఖాళీ స్టేడియాల్లో ఈ మ్యాచ్‌ నిర్వహించినా, టీవీల్లో వీక్షణల ద్వారా భారీగా డబ్బులు వస్తాయని చెప్పాడు. ఈ మ్యాచ్‌ టీవీలకే పరిమితమవ్వాలి. చాలా కాలం తర్వాత ఇరు జట్లు పోటీ పడడంతో భారీగా వీక్షణలు వస్తాయి. ప్రకటనల ద్వారా వచ్చిన డబ్బును కరోనా నివారణ కోసం ఇరు దేశాల ప్రభుత్వాలకు సమానంగా పంచాలి అంటూ అక్తర్‌ అభిప్రాయపడ్డాడు.