భారత్ లో టెస్ట్ సిరీస్ గెలవడమే నా లక్షం: స్మిత్‌

వాస్తవం ప్రతినిధి: ఇండియాలో టెస్ట్‌‌ క్రికెట్‌ ఆడటం కత్తి మీద సామే అయినా.. ఇక్కడ ఈ ఫార్మాట్‌లో సిరీస్‌‌ గెలవడం తన కెరీర్‌‌లో మేజర్‌‌ గోల్‌‌ అని స్పష్టం చేశాడు. ‘ఇండియాలో టెస్ట్ సిరీస్ ‌ గెల వడాన్ని నేను ఎక్కువగా ఇష్టపడతా. ఓ ఆసీస్‌‌ క్రికెటర్‌‌గా యాషెస్‌‌ గురించి మాట్లాడటం పెద్ద విషయం. తర్వాత వరల్డ్ ‌కప్‌ గురించి. కానీ నా దృష్టిలో ఇప్పుడు ఇండియా వరల్డ్‌‌ నంబర్‌ ‌వన్‌ టీమ్‌. అందుకే ఇక్కడ సిరీస్‌‌ గెలిస్తేవచ్చే మజా డిఫరెంట్‌గా ఉంటుంది. నాకు ఈ గోల్‌‌ తప్ప మరే టార్గెట్స్‌‌ లేవు. ఎక్కువ గోల్స్ ‌పెట్టుకోవడం కూడా నాకు ఇష్టం ఉండదు’ అని స్మిత్‌ స్పష్టం చేశాడు. టీమిండియా లెఫ్ట్ ఆర్మ్‌‌ స్పిన్నర్‌‌ రవీంద్ర జడేజా బౌలింగ్‌ను ఎదుర్కోవడం చాలా కష్టమని స్మిత్‌ చెప్పాడు.