తిరుమల ఘాట్ రోడ్డులో యదేచ్చగా తిరుగుతున్న వన్య మృగాలు

వాస్తవం ప్రతినిధి: లాక్ డౌన్ కారణంగా తిరుమల దాదాపు నిర్మానుష్యంగా మారిపోయింది.దీంతో తిరుమల వీధుల్లో వన్యమృగాలు సంచారం ఎక్కువైంది. చిరుతలు అయితే యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. శ్రీవారి సేవాసదన్, కల్యాణ వేదిక మ్యూజియం పరిసరాల్లో ఎలుగు బంట్లు, చిరుతలు సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు గుర్తించారు దీంతో స్థానికులు, టిటిడి సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు.

అలాగే బాలాజీ నగర్ ప్రాంతంలో చిరుతలు, అడవి పందుల సంచారాన్ని గుర్తించారు. ఇక ఘాట్ రోడ్డులో అయితే చిరుతల సంచారం విపరీతంగా పెరిగింది. పాపవినాశనం ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తున్నాయి. జింకలు, కణితి, దుప్పుల సంచారం అయితే చెప్పనక్కర్లేదు.