జేసీ తో భేటీ అయిన బీజేపీ ఎంపీ…సీక్రెట్ అదేనా..?

వాస్తవం ప్రతినిధి: మాజీ టీడీపీ నేత బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తాజాగా టీడీపీ మాజీ ఎంపీ అనంతపురం జిల్లా కీలక నేత జేసీ దివాకర్ రెడ్డి  తో భేటీ అయ్యారు.టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని వెంటబెట్టుకుని మరీ అనంతపురం జిల్లా తాడిపత్రి వెళ్లిన సీఎం రమేష్ జూటూరులోని జేసీ దివాకర్ రెడ్డి ఫామ్ హౌస్ లో ముగ్గురు కలిసి సుమారుగా నాలుగు గంటల పాటు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వారు ఏం మాట్లాడుకున్నారో పూర్తిగా తెలియకపోయినప్పటికీ కూడా రాయలసీమలో బీజేపీ బలోపేతం చేయడానికి సీఎం రమేష్ దివాకర్ రెడ్డిని బిజెపిలోకి ఆహ్వానించారనే చర్చ జరుగుతుంది. అయితే సీఎం రమేష్ జేసీ దివాకర్ రెడ్డి మంచి స్నేహితులు కాబట్టి ..ఆ స్నేహ బంధంతోనే ఇద్దరు కలిసారని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి.