తెలంగాణ లో ఇకపై అలా చేస్తే జైలుకే!

వాస్తవం ప్రతినిధి: ఢిల్లీ నుంచి వచ్చిన తబ్లిగీల వల్ల.. విపరతీంగా.. వైరస్ కేసులు బయటపడుతున్నాయి. వారు.. వారి కాంటాక్ట్ కేసుల కారణంగా… తెలంగాణలో.. పాజిటివ్ కేసులు.. అంతకంతకూ పెగిరిపోతున్నాయి. ఏప్రిల్ ఏడో తేదీ కల్లా… కరోనా ఫ్రీ స్టేట్‌గా ఉంటుందని కేసీఆర్ భావించారు. కానీ ఆ తర్వాతే.. తబ్లిగీల కేసులు బయటకు వచ్చాయి. దాంతో.. ఇప్పుడు.. కేసులు 450కి చేరువుగా వచ్చాయి. ఈ కారణంగా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది.

ఇక నుంచి తెలంగాణలో బహిరంగ ప్రదేశాల్లో పాన్ తంబాకు ఉమ్మివేయడాన్ని.. అలాగే కామన్ గా కూడా ఉమ్మి వేయడాన్ని నిషేధిస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తున్నట్టు ప్రకటించింది. నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు.

కరోనా వైరస్ ప్రధానంగా దగ్గినప్పుడు తుమ్మినప్పుడు తుంపర్ల ద్వారా ఉమ్మివేయడం ద్వారా తెమడ ద్వారా వ్యాపిస్తుంది. దీన్ని ఐసీఎంఆర్ కూడా తాజాగా తెలిపింది. ఈ నేపథ్యం లో తెలంగాణ సర్కారు కఠిన నిబంధనలను తెలంగాణ లో అమలుకు నిర్ణయించింది.