గోదావరి జలాలతో ఆలయ ప్రాంగణంలోనే ఉత్సవ మూర్తులకు చక్రతీర్థం

వాస్తవం ప్రతినిధి: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో గత నెల 25 నుంచి జరుగుతున్న వసంతపక్ష ప్రయుక్త నవాహ్నిక శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. పవిత్ర గోదావరి నదికి ఉత్సవం గా బయలుదేరి గోదావరి నదిలో చక్రతీర్థం నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా అమలులో ఉన్న ఆంక్షల దృష్ట్యా ఆలయంలోని నిత్యకల్యాణ మండపం వద్దనే చక్రతీర్థం కార్యక్రమం నిర్వహించారు ఉదయం ఉత్సవ మూర్తులకు చక్రతీర్థం నిర్వహించుటకు గోదావరి నది నుంచి తీసుకువచ్చిన జలాలతో (తీర్ద బిందె)కార్యక్రమం నిర్వహించారు . గోదావరి నది ఒడ్డున గల పునర్వసు మండపంలో నవకలశ స్నపనం జరగాల్సి ఉన్నప్పటికీ ఈ కార్యక్రమం కూడా ప్రధాన ఆలయంలో ఉన్న నిత్యకల్యాణ మండపం వద్దనే నిర్వహించారు..

అనంతరం సుదర్శన చక్రానికి గోదావరి జలాలతో అభిషేకం నిర్వహించారు అనంతరం యాగశాలలో మహా పూర్ణాహుతి కార్యక్రమం , ఆ తర్వాత గరుడ పటాన్ని ధ్వజస్తంభం నుంచి దింపి ప్రత్యేక పూజలు , దేవతలందరికీ ప్రత్యేక పూజల ద్వారా ఉద్వాసన(వీడ్కోలు) పలకడంతో. బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు అధికారికంగా నేటితో పరిసమాప్తమైనట్లు .. ఏది ఏమైనప్పటికీ అత్యంత వైభవంగా జరగవలసిన శ్రీ భద్రాద్రి సీతా రామచంద్రస్వామి వారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఈ సంవత్సరం కరోనా కారణంగా భక్తులు తీవ్ర నిరాశకు గురిచేసిందని రామ భక్తులు వాపోతున్నారు…